నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంకు చెందిన ఒక యువతి తనపై 11 ఏళ్లుగా 139 మంది అత్యాచారంకు పాల్పడ్డారు అంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చి సంచలనం సృష్టించింది. ఆ కేసులో యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు ఇంకా రాజకీయ ప్రముఖులు, విద్యార్థి నాయకులు, వైధ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఆ కేసుపై అందరి దృష్టి ఉంది.
11 ఏళ్లుగా ఆమె పై అత్యాచారం అది కాకుండా 139 మంది అంటూ కేసు నమోదు అవ్వడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ కేసును ఆమె పబ్లిసిటీ కోసం పెట్టిందని కొందరు కొట్టి పారేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె విషయం అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఉన్నట్లుండి ఎందుకు ఇప్పుడు అందరిపై ఫిర్యాదుకు సిద్దం అయ్యిందని అంటున్నారు.
ఇక ఇప్పటికే తనపై వచ్చిన ఫిర్యాదుకు యాంకర్ ప్రదీప్ స్పందించాడు. ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నాడు. ఈ కేసులో ప్రముఖులను ఇరికించడం వల్ల కేసు తీవ్రత పెంచవచ్చు అనే ఉద్దేశ్యంతో ఆమె ఇలా చేసి ఉంటుందేమో అంటూ కొందరు భావిస్తున్నారు. ఇక ఈ విషయంలో నటుడు కృష్ణుడు కూడా స్పందించాడు. కేసులో తన పేరు రావడం ఆశ్చర్యంగా ఉందన్నాడు. అసలు తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు.
పోలీసులు ఈ వషయంలో సమగ్ర విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. అయినా గత 11 ఏళ్లుగా అఘాయిత్యం జరుగుతుంటే ఫిర్యాదు చేయకుండా ఆమె ఎలా ఉందంటూ ఆయన ప్రశ్నించాడు. ఈ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తూ ఉంది. ముందు ముందు ఇది ఎంత దూరం వెళ్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నరు.