గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న రానా..లాక్ డౌన్ వేళ కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య మిహికాని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. కరోనా ప్రభావం వల్ల వివాహనంతరం రానా, మిహీక దంపతులు హనీమూన్‌కు వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసారు. ప్రస్తుతం రానా సినిమాల ఫై ఫోకస్ పెట్టి షూటింగ్ లతో బిజీ అయ్యారు.
గత రాత్రి రానా తన సతీమణి బర్త్‌డే కావడంతో అర్ధరాత్రి పిజ్జా క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. పెళ్ళామ్స్ బర్త్‌డే.. మనకు హాలీడే అనే ఫన్నీ క్యాప్షన్‌తో రానా షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. మరో వైపు మిహికా కూడా తన బర్త్‌డే ఫొటోలని షేర్ చేస్తూ.. నా బలవంతం వలన రానా హాలీడే తీసుకున్నాడు అంటూ కామెంట్ పెట్టింది.