అలనాటి అందాల తార రమ్యకృష్ణ బాహుబలి చిత్రంలోని శివగామి పాత్ర తో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పాత్ర ఆమెకు అంతలా గుర్తింపు తెచ్చింది. బాహుబలి కి ముందు సినిమాల్లో ఛాన్స్ లు వచ్చిన ఆమె కు సరైన గుర్తింపు లభించలేదు. చాలా ఏండ్ల కింద సూపర్ స్టార్ రజినీకాంత్ నరసింహా చిత్రంలో నీలాంబరి పాత్ర తెలుగు, తమిళ స్టేట్స్ ను ఓ ఊపు ఉపేసెంది.
ఆ తర్వాత ఆమె కు చాలా సినిమాలో మంచి పాత్రలే వచ్చాయి కానీ ఏవి గుర్తింపు తేలేదు. బాహుబలి తర్వాత రమ్యకృష్ణ స్థాయి వేరే. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆమె పూరీజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న లైగర్ అనే చిత్రంలో ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుందని సమాచారం.
దర్శకుడు ఆ పాత్రను కొత్తగా చూపించనున్నాడని సమాచారం. అలాగే ఆకాశ్ పూరీ నటిస్తున్న రొమాంటిక్ మూవీలో ను రమ్యకృష్ణ ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్ట దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ సిఎం పాత్రలో నటిస్తుందని సమాచారం. ఈ మూడు చిత్రాల ద్వారా తనకు మరల మంచి అవకాశాలు వస్తాయి అని గట్టి నమ్మకం పెట్టుకుంది.
బాహుబలి తర్వాత తెలుగులో ఆమె అఖిల్ తో హలో, నాగ చైతన్య తో శైలజ రెడ్డి అల్లుడు చిత్రంలో నటించింది. కానీ ఈ చిత్రాలో ఆమె స్థాయికి తగిన పాత్రలు కావు. నాగార్జున హీరోగా చేసిన సోగ్గాడే చిన్ని నాయన మాత్రమే ఆమె స్థాయి తగిన పాత్ర అని చెప్పాలి. రమ్య కృష్ణ కూడా శివగామి పాత్రకు వచ్చిన గుర్తింపు మరల ఇప్పుడు రాబోయే సినిమాల ద్వారా వస్తుందని ఎదురుచూస్తుంది.