
రవితేజ హీరోగా, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా గురింతి అందరికీ తెలిసిందే. అయితే శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో రూపొందించినట్లు చిత్ర బృందం చెబుతోంది. అయితే మాస్ మహారాజ రవితేజ చేస్తున్న ఈ కొత్త సబ్జెక్టు పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో తెగ ఆసక్తి రేకెత్తించిన డైరెక్టర్ శరత్ మందవ మరో లేటెస్ట్ అప్డేట్ ను ప్రేక్షకులతో పంచుకున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అతి త్వరలో రాబోతుందంటూ… ట్వీట్ చేశారు. అయితే దానిని చిత్ర నిర్మాణ సంస్థలు ఎస్ఎల్ వీసీ సినిమాస్ మరియ్ రవితేజ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుందని వివరించారు. దీంతో ఈ అప్డేట్ తెగ వైరల్ అవుతోంది. చాలా కాలం నుంచి రవితేజ సినిమా కోసం వేచి చూస్తున్న అభిమానులంతా ఈ విషయం తెలిసి తెగ సంబర పడిపోతున్నారు.

ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ్ సరసన మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ కథానాయిగా నటిస్తోందనే విషయం మనకు తెలిసిందే. అలాగే సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. అయితే మార్చి 25న లేదా ఏప్రిల్ 15న కానీ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాలన్నీ తెలియాలంటే ఇంకా కొంత కాలం పాటు ఆగాల్సిందే.