సంచలన విషయాలను మరియు వివాదాస్పద విషయాలను సినిమాలుగా తీస్తూ క్యాష్ చేసుకుంటున్న రామ్ గోపాల్ వర్మ ఈమద్య కాలంలో పలు సినిమాలను తీసిన విషయం తెల్సిందే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన 139 మంది రేప్ సంఘటన ప్రస్తుతం ఆయన దృష్టికి వచ్చిందట. తప్పకుండా ఆ సినిమాను తీస్తాడనే ప్రచారం జరుగుతోంది.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఇప్పటికే పలు సినిమాలు వస్తున్నాయి. ఓటీటీ సినిమాలు విడుదల పెరిగిన నేపథ్యంలో ఆయన వరుసగా సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన ఆన్ లైన్ థియేటర్ కోసం మూడు చిన్న సినిమాలను తెరకెక్కించడంతో పాటు రెండు సినిమాలను కూడా ఆయన నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.
వర్మ తీసిన సినిమాలు ఈమద్య కాలంలో నిరాశ పర్చతూ వస్తున్నాయి. అయినా కూడా ఆయన మాత్రం వివాదాస్పద అంశాలతో సినిమాను తీస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉన్నాడు. ఇక 139 మంది తనను రేప్ చేశారంటూ ఆ యువతి చేసిన ఫిర్యాదు చర్చనీయాంశం అయ్యింది. ఆమె పై సినిమా తీస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనలో వర్మ ఉన్నాడట. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది. అది పూర్తి అయిన తర్వాత ఆమె గురించి సినిమా తీసే అవకాశం ఉందని ఇండ్రస్టీ వర్గాల వారు అంటున్నారు.
ఇప్పుడు ఉన్న పరిస్థితులు మరియు ఇతర్రత విషయాల నేపథ్యంలో వర్మ ఏం తీసినా కూడా సంచలనమే అవుతుంది. దానికి ఎంత వచ్చాయి అనే విషయం పక్కన పెడితే ఎంత పబ్లిసిటీ వచ్చింది అనే విషయంలోనే చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ వర్మ నిజంగానే 139 మంది రేప్ ఘటనపై సినిమా తీస్తే అది సంచలనం అవుతుందని అంటున్నారు.