రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ఇటీవలే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజ్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లేవల్లో రూపొందించనున్నాడు. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 చిత్రాన్ని కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే చరణ్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఆలోగా చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఫ్రీ అవ్వుతాడు.
శంకర్ సినిమా అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది. అద్బుతమైన గ్రాపిక్స్, ఇంతకు ముందు ఎన్నడూ చూడని లొకేషన్స్ ఓ వింత ప్రపంచంలో విహారిస్తున్నట్లుగా ఉంటుంది. మరి చరణ్ తో అలాంటి సినిమా ఏదైనా రూపొందిస్తున్నాడా అనే ఆలోచన మెగా అభిమానుల్లో ఓ సందేహం ఉంది. ఆ మధ్య సోషల్ మీడియాలో రామ్ చరణ్ తో ఒకేఒక్కడు సినిమాకు సీక్వెల్ ను రూపొందించబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలు నిజం కావని తేలిపోయింది. చరణ్ తో శంకర్ ఓ కొత్త కథను తెరకెక్కించనున్నాడు అంట.
ఈ చిత్రంలో చరణ్ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు అని తాజా సమాచారం. అవినీతి పై పోరాడే ఓ పవర్ ఫుల్ పోలీసు గా చరణ్ కనిపించబోతున్నాడు అని టాలీవుడ్ మీడియా కొడై కూస్తుంది. అవినీతి అనే అంశంపై శంకర్ నుండి ఓ రెండు మూడు సినిమాలు వచ్చాయి. కాని ఈ చిత్రం హై లేవల్లో జరిగే ఓ అవినీతికి సంబందించిందని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ కీయరా అద్వానీ పేరు మరియు రష్మిక, పూజ హెగ్డే ల పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం యోక్క ప్రీ ప్రొడక్షన్ గురించి అధికారిక ప్రకటన వెలువడనున్నది.