మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నెక్స్ట్ సినిమా విషయంలో పలు ప్రముఖ దర్శకుల పేర్లు వినపడుతున్నాయి. అందులో ముఖ్యంగా తమిళ దర్శకుడు శంకర్, మరో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఇప్పటికే ఈ దర్శకులు రామ్ చరణ్ కు కథలను కూడా వినిపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ముందుగా శంకర్ కథనే ఓకే చేసినట్లుగా టాలీవుడ్ మీడియా కొడై కూసింది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు చరణ్, గౌతమ్ తిన్ననూరి కథకే ఓటు వేసినట్లుగా తెలుస్తుంది. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా కథలను రామ్ చరణ్ కి వినిపించిన గౌతమ్, చివరికి ఓ సూపర్ కథను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ దర్శకుడు ఇంతకు ముందు మళ్ళీ రావా చిత్రంతో తెలుగు సినిమాకు పరిచయం అయ్యాడు. చిన్న సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో నాని కన్ను ఈ దర్శకుడుపై పడింది.
ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో జెర్సీ వచ్చింది. రామ్ చరణ్ కు జెర్సీ టేకింగ్ బాగా నచ్చిందని పలు ఇంటర్వ్యూ లోనూ చెప్పాడు. ఇప్పుడు ఆ చిత్రం బాలీవుడ్ లో రీమేక్ అవ్వుతుంది. అక్కడ కూడా ఈ దర్శకుడే దర్శకత్వం వహిస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరో గా నటిస్తున్నాడు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోవడం గ్యారెంటి. కావున గౌతమ్ తిన్ననూరి తో చేయబోయే చిత్రం కూడా పాన్ ఇండియా లేవల్లో ఉండేవిదంగా చూడనున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్నదని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ చిత్రీకరణలో ఉన్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 13 న విడుదల అవ్వనున్నది. ఈ నేపథ్యంలోనే కొరటాల ఆచార్య చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చర్రికి జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రం మే 13 న విడుదల అవ్వుతుంది.