ఎన్ లింగుస్వామి ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదు. అవును విశాల్ తో పందెం కోడి, మాధవన్ తో రన్, సికిందర్ వంటి సూపర్ హిట్టు చిత్రాలకు దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు. ఈయన దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత, స్క్రీన్ రైటర్ కూడాను. తాజా సమాచారం మేరకు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించనున్నాడు అని తెలుస్తుంది.
అవును ఈ మధ్య రామ్ ను కలిసి కథను చెప్పినట్లుగా తెలుస్తుంది. అయిన చెప్పిన తీరు రామ్ కు బాగా నచ్చిందంట. రామ్ కూడా ఒకే చేసినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రంతో అటు తమిళ్ లోకూడా రామ్ అడుగు పెట్టబోతున్నాడు. ఈ చిత్రాని శ్రీనివాస చిత్తూరి నిర్మించనున్నాడు. 2018 లో పవన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన యూటర్న్ చిత్రాని శ్రీనివాస చిత్తూరి నిర్మించాడు.
ఈ చిత్రంలో సమంత లీడ్ రోల్ లో నటించింది. ఇక వరస విజయలతో దూసుకుపోతున్న ఎనర్జటిక్ స్టార్ ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. గడిచిన ఏడాది పురి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ ట్రాక్ ను అందుకున్నాడు. మాస్ హీరోగా కొత్తగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే చిత్రంలో నటించి మరో హిట్టు ను అందుకున్నాడు. ఈమధ్యనే శివమాల కూడా వేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఆ లుక్ ట్రెండ్ సెట్ చేసింది.