వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో చాలా హిట్ చిత్రాల్లో నటించింది. ఫిట్ నెస్ విషయంలో ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ ఎవరు పోటీకి రారు అవిదంగా ఆమె ఫిట్ నెస్ లేవల్స్ ఉంటాయి. షూటింగ్ సమయంలో ఏ మాత్రం గ్యాప్ దొరికిన వ్యాయామాలు చేస్తూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు జిమ్ సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్ మరియు వైజాగ్ లో జిమ్ సెంటర్స్ ఉన్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం అక్కడే సినిమాలు చేస్తుంది. తాజాగా రకుల్ మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసనా యువర్ లైఫ్ అనే వెబ్సైట్ ను రన్ చేస్తున్న సంగతి తెలిసింది. ఈ సైట్ ద్వారా ఉపాసనా సెలబ్రేటీల హెల్త్ మరియు ఫిట్ నెస్ రహస్యలను తెలుసుకుంటుంది. తమన్నా, రష్మిక, ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ విచ్చేశారు. రీసెంట్ గా రకుల్ వచ్చింది.
ఉపాసనా రకుల్ ప్రీత్ సింగ్ తో మీరు డ్రింక్ చేయరు అని నాకు తెలుసు ఎందుకు డ్రింక్ చేయరో తెలుసుకోవచ్చ అని ప్రశ్నించగా అందుకు రకుల్ నేను లైఫ్ లో సంతోషం గా ఉన్నాను అందుకే డ్రింక్ చేయను అని సమాదానం ఇచ్చింది. కొంతమంది నెటిజన్స్ డ్రింక్ చేయనని చెప్పినందుకు ఆమెను ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. మరికొందరు మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ తో అప్రిషియేట్ చేస్తున్నారు.
మరో ప్రశ్నగా మీరు ఏ పనులు చేస్తే సంతోషం గా ఉంటారు. హెల్తి ఫుడ్ మరియు వ్యాయామం చెయ్యడం ద్వారా సంతోషం గా ఉంటాను అని సమాదానం ఇచ్చింది. రకుల్ సినిమా విషయానికి వస్తే క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే చిత్రంలో నటించింది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు.