వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన రకుల్ ప్రీతీ సింగ్..మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల ఛాన్సులు రావడం తో అతి తక్కువ టైంలోనే టాప్ ప్లేస్ కు చేరుకుంది. కానీ ఎంత త్వరగా టాప్ కు వెళ్లిందో అంతే త్వరగా డౌన్ కు చేరుకుంది. ప్రస్తుతం తెలుగు లో ఒకటి , రెండు సినిమాలు చేస్తున్న ఈమె..తాజాగా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో తెలిపింది.
కుటుంబ సభ్యులను గౌరవించడంతో పాటు సాంప్రదాయాలను కూడా గౌరవించే వ్యక్తి అయ్యి ఉండాలి. హెల్తీ లైఫ్ స్టైల్ ను లీడ్ చేసే వ్యక్తి అయ్యి ఉండాలని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి వేదిక విషయానికొస్తే.. తనకు బీచ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఉందంటూ ఓపెన్‌గా చెప్పేసింది. అది కూడా కేవలం అత్యంత సన్నిహితుల సమక్షంలోనే తమ వివాహం జరగాలని కోరుకుంటుంది. మరి రకుల్ కు కాబోయే వరుడు ఎక్కడ ఉన్నాడో మరి..