సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశం ఫై అధికారిక క్లారిటీ ఇవ్వడం తో తమిళనాట సంబరాలు మొదలయ్యాయి. ఈ నెల 31వ తేదీన రాజకీయ పార్టీ ప్రకటన చేస్తున్నట్లు రజని తెలిపారు. సమయం దగ్గర పడుతుండడం తో ఆ పనుల్లో రజని బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరున ప్రకటించే పేరు, గుర్తు దాదాపు ఖరారైనట్లు సోషల్ మీడియా లో వార్తలు ప్రచారం మొదలయ్యాయి. రజినీకాంత్ తన కొత్త పార్టీకి ‘మక్కల్ సేవై కర్చీ'( ప్రజాసేవ పార్టీ ) అనే పేరు దాదాపు ఖరారు చేసారని , అలాగే పార్టీకి ఆటో గుర్తును ఎలక్షన్ కమిషన్ ఖరారు చేసినట్లుగా ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ వార్తల ఫై రజనీకాంత్ సామాజిక సేవా విభాగం రజనీ మక్కళ్ మండ్రం వివరణ ఇచ్చింది.
కొత్త పార్టీ పేరుపై అధికారిక ప్రకటన వచ్చే దాకా ఓపిక పట్టాలని సూచించింది. మరోవైపు.. రజినీకాంత్ పార్టీతో పొత్తుపై కమల్‌హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా సిద్ధాంతాలు దగ్గరగా ఉండి.. ప్రజలకు మేలు జరుగుతుందన్న పక్షంలో అహాన్ని పక్కన పెట్టి సహకరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ లెక్కన చూస్తే కమల్ , రజని తో చేయి కలపడం ఖాయంగా కనిపిస్తుంది.