ఎట్టకేలకు సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశం ఫై అధికారిక క్లారిటీ ఇవ్వడం తో తమిళనాట సంబరాలు మొదలయ్యాయి. ఈ నెల 31వ తేదీన రాజకీయ పార్టీ ప్రకటన చేస్తున్నట్లు రజని తెలిపారు. సమయం దగ్గర పడుతుండడం తో ఆ పనుల్లో రజని బిజీ అయ్యారు. గురువారం పార్టీ ముఖ్యులు అర్జున్‌మూర్తి, తమిళరివి మణియన్ మక్కల్ మండ్రం జిల్లాల కార్యదర్శులతో రజని భేటీ అయ్యారు.
పార్టీ పేరు, చిహ్నం, జెండా విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ పేరును సీక్రెట్‌గా ఉంచినా.. చిహ్నం, జెండాపై మాత్రం లీకులు బయటకు వచ్చాయి. ప్రజల్ని ఆకర్షించే విధంగా మూడు వర్ణాలతో రజనీ పార్టీ జెండా రూపుదిద్దుకోబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ చిహ్నంగా సైకిల్‌ను ఫైనల్ చేస్తే ఏవైనా అభ్యంతరాలు, వివాదాలు తలెత్తే అవకాశాలు ఉండవచ్చని రజినీ సన్నిహితులు భావిస్తున్నారు. దీంతో ‘అన్నామలై’ చిత్రంలో సైకిల్, పాల క్యాన్ గెటప్‌లో ఉన్న రజినీ ఫోటోనే పార్టీకి చిహ్నంగా మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఫైనల్ చేస్తారా లేదా అనేది చూడాలి.