రాజమౌళి డైరక్షన్ లో రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ టైం కు కరోనా కేసులు పెరగడం వల్ల చివరి నిమిషంలో రిలీజ్ ఆపేశారు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడటంతో ఫైనాన్షియర్స్ నుండి ప్రెజర్స్ ఎక్కువయ్యాయి. ఈ విషయంలో కంగారు పడుతున్న దానయ్యకి రాజమౌళి అభయం ఇచ్చారట.
దాదాపు ఆర్.ఆర్.ఆర్ సినిమాకు ఫైనాన్షియర్స్ కు ఇవ్వాల్సిన 180 కోట్లకు రాజమౌళి మాట ఇచ్చాడని తెలుస్తుంది. సినిమా ఎప్పుడు రిలీజైనా సరే ఆ టైం లో వారికి ఆ ఎమౌంట్ ఇప్పించేలా రాజమౌళి సంతకం చేశారట. ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇప్పటికే చాలా చోట్ల బిజినెస్ చేయగా సినిమా రిలీజ్ వాయిదా పడటంతో వాళ్లు కూడా తిరిగి డబ్బులు అడుగుతున్నారని తెలుస్తుంది.
జనవరి 7 శుక్రవారం రిలీజ్ అనుకున్న ఆర్.ఆర్.ఆర్ కాస్త వాయిదా పడ్డది. ఈ ఇయర్ సమ్మర్ కి వరుస స్టార్ సినిమాలు ఉండటం వల్ల జూలైలో ట్రిపుల్ ఆర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.