
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)ఆర్.ఆర్.ఆర్ తర్వాత మహేష్ తో సినిమా చేస్తాడన్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ తో సినిమా 2023 లో మొదలవుతుందని టాక్. ఈ సినిమా కూడా రెండేళ్లు పడుతుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ తర్వాత రాజమౌళి కరణ్ జోహార్ తో సినిమా చేస్తాడని టాక్. ఆల్రెడీ కరణ్ జోహార్ తో డీల్ సెట్ చేసుకున్నాడని టాక్.
బాహుబలి సినిమాని బాలీవుడ్ లో కరణ్ జోహార్ రిలీజ్ చేశారు. ఆ సినిమా బాలీవుడ్ లో సృష్టించిన సంచలనాలు తెలిసిందే. ఇక అదే క్రేజ్ తో కరణ్ జోహార్ చేస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాని రాజమౌళి సమర్పిస్తున్నారు. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ గా రాజమౌళి, కరణ్ జోహార్ కాంబినేషన్ లో ఉంటుందని తెలుస్తుంది. మహేష్ సినిమా పూర్తి కాగానే కరణ్ తో జక్కన్న(Rajamouli) మూవీ ఉంటుందని టాక్.
మరి ఈ సినిమాలో తెలుగు హీరో నటిస్తాడా లేక ఈసారి బాలీవుడ్ హీరో చేస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. రాజమౌళి సినిమా అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా అన్నట్టే. ఆర్.ఆర్.ఆర్ తో అది మళ్లీ ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు జక్కన్న.