దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం “ఆర్‌ఆర్‌ఆర్” అనే పాన్ ఇండియా చిత్రంను రూపొందిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ఎన్‌టిఆర్, రామ్ చరణ్ లు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యం కలిగిన కథాంశం గా తెరకెక్కుతుంది. ఎన్‌టిఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుంటే, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రం నుండి వీరు పోషించిన పాత్రలకు సంబందించిన టిజర్స్ ను రాజమౌళి విడుదల చేశాడు. మెగా, నందమూరి అభిమానులనుండి విపరీతమైన ఆదరణ లభించింది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఈ ఏడాది విడుదల కావలసి ఉంది. కానీ కరోనా కారణంగ షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వడంతో విడుదలకు సమయం పట్టేలాగా ఉంది. ప్రస్తుతం రాజమౌళి ఆర్‌ఎఫ్‌సి లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తున్నాడు.
ఈ చిత్రంలో బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్, కొలీవుడ్ దర్శకుడు సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్ట్, ఒలివియా మోరిస్ లు కథానాయకలుగా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హింది, మలయాళ, కన్నడ బాషల్లో విడుదల కానున్నది. ఆర్‌ఆర్‌ఆర్ విడుదల విషయంలో రాజమౌళి రెండు డేట్స్ ను ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఒక్కటి అక్టోబర్ 8 2021 అంటే దసరా కానుకగా విడుదల చెయ్యనున్నాడు. మరో డేట్ వచ్చేసి జనవరి 14 2022 నాడు. కరోనా కారణంగ యూఎస్ లో సినిమా థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఈ లోగా పూర్తి స్థాయిలో థియేటర్స్ ఓపెన్ చేస్తే మాత్రం ఈ దసరకి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని (అక్టోబర్) లో విడుదల చెయ్యనున్నాడు. లేదు పరిస్థితి ఇలానే కొనసాగితే మాత్రం సెకెండ్ ఆప్షన్ గా 2022 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు.
ఎందుకు అంటే ఏ చిత్రానికి అయిన యూఎస్ బిజినెస్ చాలా ముఖ్యం. అసలుకే ఆర్‌ఆర్‌ఆర్ భారీ బడ్జెట్ తో కూడిన చిత్రం. ఏ మాత్రం పరిస్థితి అటు ఇటు అయిన నిర్మాతకు కోలుకోలేని దెబ్బ పడుతుంది.