ధర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ అనే పాన్ ఇండియా చిత్రం రూపొందుతుంది. టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్ , ఎన్‌టిఆర్ లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ. పీరియాడికల్ నేపథ్యం కలిగిన సోషియో ఫాంటసీ మూవీ. ఈ చిత్రం ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సి లో క్లైమాక్స్ షూట్ జరుపుకుంటుంది. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాణి నిర్మిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం యొక్క విడుదల పై అనేక రకాల వార్తలు వచ్చాయి.
వచ్చే ఏడాది సంక్రాంతి కి ఈ చిత్రం విడుదల అవ్వుతుందని కొంతమంది అంటుంటే లేదు దాసర రోజున విడుదల చేస్తారు అని మరి కొందరు అంటున్నారు. అయితే చిత్రం బృందం మాత్రం అక్టోబర్ 13 న విడుదల చేస్తున్నాం అని రామ్ చరణ్ ఎన్‌టిఆర్ ల లుక్ తో సహా విడుదల చేసింది ఇప్పుడు ఈ లుక్ పెద్ద కాంట్రవర్శిగా మారింది. 2017 లో మార్క్ స్టీవన్ జాన్సన్ దర్శకత్వంలో గోస్ట్ రైడర్ అనే చిత్రం వచ్చింది ఈ చిత్రంలో హీరో నికోలస్ కేజ్ బైక్ పై, హార్స్ పై మంటలు కక్కుతూ రైడ్ చేస్తాడు ఆ లుక్ ను ప్రచారం కోసం ఆ చిత్రా దర్శకుడు విడుదల చేశాడు.
ఇప్పుడు అదే లుక్ తో సేమ్ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ పోస్టర్ ను రామ్ చరణ్ హార్స్ నడుపుతూ, ఎన్‌టిఆర్ బైక్ నడుపుతూ విడుదల చెయ్యడంతో సోషల్ మీడియాలో రాజమౌళి పై ట్రోల్స్ చేస్తున్నారు. హాలీవుడ్ మూవీ గోస్ట్ రైడర్ పోస్టర్ ను రాజమౌళి కాపీ కొట్టాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి కి వివాదాలు కొత్తేమి కాదు బాహుబలి చిత్రంలో కూడా రమ్యకృష్ణ పాపను నీటిలో ఉండి చెయ్యి పైకి ఎత్తి పట్టుకున్న పోస్టర్ కూడా హాలీవుడ్ మూవీ నుండి కాపీ కొట్టాడు అంటూ అప్పుడు విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ పోస్టర్ విషయంలో మరోసారి అలాంటి వివాదమే తలెత్తింది. ఈ పోస్టర్ పై ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ నుండి ఎలాంటి సంజాయిషీ ఇవ్వలేదు.