అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండకు ఎంత గుర్తింపు వచ్చిందో అందరికి తెలిసిందే. టాలీవుడ్ కు మరో సూపర్ స్టార్ దొరికాడని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమాలో అర్జున్ రెడ్డి ఫ్రెండ్ గా నటించాడు రాహుల్ రామకృష్ణ. అర్జున్ రెడ్డి మూవీతో రాహుల్ రామకృష్ణకు కూడా మంచి గుర్తింపు లభించింది. తర్వాత రామకృష్ణకు చాలా సినిమాల్లో అవకాశాలు లభించాయి. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు రాహుల్. వరుస ప్రాజెక్టులకు ఓకే చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నారు.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్ఆర్ లోనూ ఆయన ఓ రోల్ పోషించారు. తరచూ తన సినిమా అప్డేట్స్తో ట్విట్టర్ వేదికగా పలకరించే రాహుల్ రామకృష్ణ.. తాజాగా చేసిన ఓ ట్వీట్ అందర్నీ షాక్ కు గురిచేసింది. ఉన్నట్టుండి సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. ఇక మీదట సినిమాలు చేసేది లేదని ప్రకటించాడు. 2022 ఇదే నా చివరిది. ఇకపై సినిమాలు చేయను అని ట్వీట్ చేశాడు. కెరీర్ మంచి స్థాయిలో ఉన్న సమయంలో సినిమాలు ఆపేయడం ఏమిటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అయితే దీనిపై రాహుల్ రామకృష్ణ స్పందించాడు. తాను సినిమాలు వదలడం లేదని.. గుడ్‌బై అని జోక్ చేశానని అంటూ అందర్నీ ఫూల్స్‌ను చేశాడు రామకృష్ణ. జోక్ చేశానంతే. భారీ రెమ్యునరేషన్, విలాసవంతమైన జీవితం, ఎన్నో ప్రయోజనాలు వస్తుంటే ఎందుకు కాలదన్నుకుంటాను. నేను రిటైర్మెంట్ ప్రకటించానని నా స్నేహితులు ఫోన్ చేసి మరీ చెప్పటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశాడు.
రాహుల్ చేసిన ఈ జోక్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. నీ జోకు తగలెయ్య ఇదేం జోకురా అయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు.