విప్లవాత్మక చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు , దర్శకుడు , నిర్మాత & మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ నారాయణ మూర్తి. ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా ఉంటూ ఎన్నో సినిమాల్లో నటించి నిర్మించి.. దర్శకత్వం వహించి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నప్పటికీ సింపుల్ గా ఉండడం , రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్లడం , ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడం వంటివి నారాయణమూర్తి కి మాత్రమే చెల్లింది. అలాంటి నారాయణ మూర్తి సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సోబెటర్’ సినిమా పై స్పందించాడు.
సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో హీరో కు మాజీ ప్రధాని వాజ్ పేయి.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరియు ఎర్రన్న ఆర్ నారాయణ మూర్తి గార్లు ఆదర్శం. వారి బాటలో నడవాలనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకోకుండా సోలో బ్రతుకును లీడ్ చేయాలని భావిస్తాడు. ఆ క్రమంలో సినిమాలో పలు సందర్బాల్లో ఆర్ నారాయణ మూర్తి పేరును పాత్రను వాడటం జరిగింది. ఆ విషయమై నారాయణమూర్తి స్పందిస్తూ.. అంత గొప్ప ప్రముఖుల పక్కన నన్ను ఉంచడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దర్శకుడు సుబ్బు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా అభిమానిగా కనిపించేందుకు ఒప్పుకున్న సాయి ధరమ్ తేజ్ గారికి కృతజ్ఞతలు తెలిపాడు.