దాదాపు 9 నెలల తర్వాత థియేటర్స్ లలో సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లే సాధిస్తూ మిగతా సినిమాలకు లైన్ ఇచ్చింది. అసలు సినిమాకు జనాలు వస్తారా రారా అనే అనుమానంతో సినిమాని విడుదల చేయగా, ఈ చిత్రానికి నీరాజనం పలుకుతుండడం తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు థ్యాంక్స్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.
ఈ చిత్రంలో హీరో నారాయణ మూర్తి అభిమానిగా కనిపించారు. సినిమాలో తనను పరోక్షంగా భాగం చేసినందుకు దర్శకుడికి దన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ ..
కరోనా కష్టకాలంలో సినిమా పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ సమయంలో ప్రేక్షకులు కూడా కష్టాలు పడుతూ ఉన్నారు. కనుక వారిని ఇబ్బంది పెట్టే విధంగా పెద్ద సినిమాల వారు టికెట్ల రేట్లు పెంచవద్దంటూ విజ్ఞప్తి చేశాడు. థియేటర్ల పునః ప్రారంభం ఆనందంగా ఉందని ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే విధంగా టికెట్ల రేట్లను పెంచకూడదంటూ నారాయణమూర్తి సూచించారు.