ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన పుష్ప సినిమా పార్ట్ 1 సంచలన హిట్ సాధించింది. ఈ సినిమా తెలుగుతో పాటు ఈక్వల్ గా హిందీలో వసూళ్లను రాబడుతుంది. బాలీవుడ్ లో హిందీ 60 కోట్లని రాబట్టింది. పుష్ప తమిళ వర్షన్ 25 కోట్లు.. కేరళలో 15 కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప(Pushpa) పార్ట్ 1 ఈ రేంజ్ హిట్ అవడంతో పార్ట్ 2 మీద మరింత అంచనాలు పెరిగాయి.
ఇక పుష్ప పార్ట్ 2 బిజినెస్ ఎలా ఉంటుంది. అసలు అంచనాలు లేని పుష్ప పార్ట్ 1 హిందీ, తమిళ, కేరళలో మాములు బిజినెస్ చేయగా పుష్ప పార్ట్ 1 హిట్టయ్యి పార్ట్ 2పై మరింత అంచనాలు ఏర్పరచింది. ఈ క్రమంలో పుష్ప పార్ట్ 2 బిజినెస్ ఓ రేంజ్ లో చేసే అవకాశం ఉంది. పుష్ప పార్ట్ 1 300 కోట్ల గ్రాస్ చేయగా హిందీలో దూకుడు చూస్తుంటే 100 కోట్లు తెచ్చేలా ఉంది.
ఈ లెక్కన పుష్ప(Pushpa) పార్ట్ 2లో 500 కోట్ల టార్గెట్ పెట్టుకునేలా ఉంది. పార్ట్ 1 కేవలం పాత్రల పరిచయమే కాగా పార్ట్ 2 అసలు కథ ఉంటుందని డైరక్టర్ సుకుమార్ చెప్పాడు. అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 మరింత క్రేజీగా ఉంటుందని చెబుతున్నారు.