దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ యమ స్పీడ్ గా వ్యాపిస్తుంది. వేలల్లో ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రభుత్వాలు ఏమి చేయలేని పరిస్థితి నెలకొన్నది. లాక్ డౌన్ వైపు అడుగులు వేద్దామా అంటే ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిని కోలుకోలేని పరిస్థితి వచ్చింది మరల లాక్ డౌన్ అంటే ప్రజల పరిస్థితి ఏమై పోతుంది అనే ఆలోచనలో పడ్డారు.
కరోనా పై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు సెలబ్రేటీలు కరోనా ను ముందు ఉండి పోరాడే వర్కర్స్ మరియు స్వచ్చందంగా ముందుకు వచ్చి సేవ చేసేవారు. ఇలా వారికి తోచిన విదంగా తమ సేవలను అందిస్తున్నారు. కానీ కొంతమంది రాజకీయనాయకులు తమ స్వార్థం చూసుకుంటున్నారు. కరోనా టైమ్ ను ఉపయోగించుకొని సుఖపడాలని చూస్తున్నారు అని ప్రముఖ సినిమా హీరోయిన్ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేశాడు. కొంతమంది చెత్త రాజకీయ నాయకులు తమ పార్టీ తప్ప ప్రజల కష్టాలు తెలియవని అన్నారు.
కొంతమంది కష్టం వారికి సుఖంగా మారుతుంది అన్నారు. కరోనా తో ప్రజలు చచ్చి పోతూ ఉంటే వాటిని తమ సొంత ప్రయోజనం కోసం వాడుకుంటున్నారు అని పూనమ్ అన్నారు. ఎవరైతే కరోనా విషయంలో దగ్గర ఉండి పోరాడుతున్నారో వారే నిజమైన హీరోలని పూనమ్ అన్నారు. పూనమ్ గత కొంతకాలంగా సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేస్తుంది. తద్వారా పోలిటికల్ లో ఫేంలోకి రావాలని చూస్తుంది.