నువ్వేకావాలి చిత్రంతో హీరోగా ఇండస్ట్రీ కి పరిచమైన తరుణ్..మొదటి సినిమాతోనే యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుసగా ప్రేమ కథ చిత్రాలతో అలరించిన ఈయన..కొద్దీ ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇతడికి – ప్రియమణి మధ్య ఏదో ఉందనే విషయాలను బయటపెట్టింది ప్రియమణి.
ప్రస్తుతం ప్రియమణి..వెంకటేష్ తో కలిసి నారప్ప చిత్రం తో నటిస్తుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన ఈమె..తనపై వచ్చిన ప్రేమ ప్రచారానికి సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. నవ వసంతం సినిమాలో హీరో తరుణ్‌కు జంటగా ప్రియమణి నటించారు. 2005లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. షూటింగ్ సమయంలో తరుణ్‌తో తనకు పరిచయం ఏర్పడినట్టు ప్రియమణి తెలిపారు. ఆ పరిచయంతో చాలా సార్లు లంచ్, డిన్నర్‌కు కలిసి వెళ్లినట్టు చెప్పారామె. దీంతో సహజంగానే తమద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఇండస్ట్రీలో చెవులు కొరుక్కోవడం స్టార్ట్ అయిందన్నారు.
తమ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్టు తరుణ్ ఇంట్లో కూడా నమ్మారన్నారు. ఓ రోజు షూటింగ్లో ఉండగా తరుణ్ వాళ్ల అమ్మ రోజా రమణి వచ్చారన్నారు. తనతో మాట్లాడుతూ ప్రేమ ప్రస్తావన తెచ్చారన్నారు. “తరుణ్, మీరు ప్రేమించుకున్నట్టు తెలిసింది. నీకు ఇష్టమైతే నా కుమారుడిని పెళ్లి చేసుకో” అని ఆమె కోరారన్నారు. తరుణ్ తల్లి నోట ఆ మాటలు విన్న క్షణాన షాక్ కొట్టినట్టైందన్నారు.
అయితే తరుణ్‌తో తనది కేవలం స్నేహ బంధం మాత్రమేని స్పష్టత ఇచ్చానన్నారు. తమని అపార్థం చేసుకున్నారని ఆమెతో అన్నట్టు నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.