కొన్ని నెలల ముందు వరకు నటి ప్రగతి అంటే అంతా పద్దతిగా నిండైన చీర కట్టులో కనిపించే ఆమెను ఊహించుకునేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఆమె ఈ కరోనా లాక్ డౌన్ టైంలో పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వడం వల్ల ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువ చేసింది.
ముఖ్యంగా జిమ్ వీడియోలు మరియు హాట్ డాన్స్ లతో ఆమె చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఆమె ఇప్పటికే చాలా వీడియోలు విడుదల చేసింది. ఆమె వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు మరియు ఫొటోలు కూడా రచ్చ చేస్తున్నాయి. ఈ సమయంలోనే అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌ల ఖజురారే పాటకు డాన్స్ చేసింది.
ఆ పాటలో ఐశ్వర్య చేసినట్లుగా చేసేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యింది. అయితే ఆమె బాడీ విషయంలో మాత్రం చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆంటీ గారు ఏంటీ ఈ రచ్చ అంటూ చాలా మంది ఆమెకు కామెంట్స్ చేస్తున్నారు. మీరు మరీ ఇంత ఇదిగా కనిపిస్తే స్టార్ హీరోల సినిమాల్లో మళ్లీ అమ్మ పాత్రలకు ఎంపిక అవ్వగలరా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి ప్రగతి సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈమెతో పాటు సురేఖ వాణి కూడా ఈమద్య సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. తెలుగులో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిన వీరు ఇలా సోషల్ మీడియా షో చేయడం తో అంతా కూడా నోరు వెళ్లబెట్టి చూసేలా చేస్తోంది.