తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని ఏళ్లుగా రాణిస్తున్న నటి ప్రగతి. ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు ప్రగతి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రగతి.. ఈ మధ్య తెగ ట్రెండ్ అవుతున్నారు. ఆమె తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో తన అప్ డేట్స్ ను అభిమానులతో పంచుకుంటూ ఎప్పటికప్పుడు వారితో టచ్లో ఉంటారు. అలా తన ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతున్నారు ప్రగతి.
అత్త, తల్లి పాత్రలూ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఫిట్ నెస్ కు ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చే ప్రగతి అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా యూత్ ప్రగతి ఆంటీ అంటే పడి చచ్చేలా చేసుకున్నారు. కుర్ర హీరోయిన్లను తలదన్నేలా.. అందాల ఆరబోతకూ వెనకాడరు ప్రగతి. తరచూ తన అందాలు కనిపించే ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఈ ఫోటోలను చూసి పిచ్చెక్కని కుర్రకారు ఉండదంటే సందేహం లేదు.
తన ఫిగర్ ను మెయింటైన్ చేసేందుకు ఎప్పుడూ ముందు ఉండే.. ప్రగతి కసరత్తులు అదే స్థాయిలో చేస్తూ ఉంటుంది. అందుకే ఏజ్ వచ్చి పడుతున్నా.. గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ చాలా ఫిట్ గా ఉంటుంది ప్రగతి. తాజాగా ప్రగతి ఆంటీ.. జిమ్ లో రచ్చ చేసింది. ఆ వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఓ వ్యక్తిని తన కాళ్లపై నిలుచోబెట్టుకుని మరీ విన్యాసాలు చేసింది ప్రగతి. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రగతి ఆంటీ ఎనర్జీకి ఫిదా అయిపోతున్నారు. ఈ ఏజ్ లో ఏం ఎనర్జీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
వయసు మీద పడే కొద్దీ మరింత యాక్టివ్ గా.. అంతకుమించి గ్లామరస్ గా, ఫిట్ గా తయారు అవుతున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు.