యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది. కరోనా వచ్చి ఉండకుంటే సినిమా షూటింగ్ ను పూర్తి చేసేవారు. రాధేశ్యామ్ పూర్తి కాకుండానే ప్రభాస్ మరో రెండు సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యాడు. అయితే ఆ రెండు సినిమాలు కూడా సాదా సీదా సినిమాలు కావు. ఆ రెండు సినిమాల బడ్జెట్ కలిపి దాదాపుగా 700 కోట్లకు పైగానే ఉంది.
రెండు భారీ బడ్జెట్ చిత్రాలను ఒకే సారి చేయబోతున్నాడు. షూటింగ్ కూడా ఎలాంటి తేడా లేకుండా రెండు ఒకే సమయంలో సాగబోతున్నాయట. ఈ విషయంలో ప్రభాస్ గట్స్ ను అంతా మెచ్చుకుంటున్నారు. రెండు భారీ సినిమాలను ఒకేసారి చేసేందుకు ముందుకు రావడం అనేది ఆయన గొప్ప విషయం అంటున్నారు. ఇండియాలో ఈ స్థాయి బడ్జెట్ సినిమాలను ఒకేసారి రెండు చేయగల సత్తా ఎవరికి లేదు. ఈ రెండు సినిమాలు కూడా ప్రభాస్ స్థాయిని బాలీవుడ్ హీరోలకు మించి చేస్తాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమాపై దేశ వ్యాప్తంగా అభిమానులు అసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ రెండు భారీ సినిమాలను ఎక్కడ రాజీ పడకుండా నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు పెట్టిన పెట్టుబడి పైసాతో సహా వెనక్కు వస్తాయని నిర్మాతలు ఆశిస్తున్నారు. అందుకే వందల కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు.
రాధే శ్యామ్ చిత్రం వచ్చే యేడాది సమ్మర్ లో రాబోతున్నాయి. ఇక ఆదిపురుష్ మరియు నాగ్ అశ్విన్‌ల మూవీ 2022 లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ మూడు సినిమాలో మూడు వేల నుండి నాలుగు వేల కోట్ల వరకు ప్రభాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఆదిపురుష్ చిత్రాన్ని దేశంలోని అన్ని భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు.