కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశ వ్యాప్తంగా మళ్లీ కేసులు విజృంభిస్తున్నాయి. ఈ సమయంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కన్ఫర్మ్ అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత వారం రోజులకు రావాల్సిన రాధేశ్యామ్ సినిమా ను కూడా వాయిదా వేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని కొద్ది సమయంకు ముందు వచ్చిన రాధే శ్యామ్ కొత్త పోస్టర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతోంది. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతున్న ఆ పోస్టర్ పై జనవరి 14 విడుదల అంటూ ఉంది. దాంతో సినిమా విడుదల వాయిదా పడ్డట్లుగా వార్తలు వస్తున్న సమయంలో మళ్లీ సినిమా విడుదల తేదీని ప్రకటించి గందరగోళంకు జనాలను గురి చేస్తున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అసలు విషయం ఏంటో కాని రాధే శ్యామ్ విడుదల విషయంలో ఇప్పటి వరకు మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు. కనుక జనవరి 14న విడుదల ఉందనుకునే అభిమానులు ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదల కోసం దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో ఇలా జరగడం విచారకరం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాధే శ్యామ్ కనుక మొండిగా విడుదల అయితే దాదాపుగా వంద కోట్ల వసూళ్లను లాస్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లు టార్గెట్ గా రాబోతున్న రాధే శ్యామ్ కు అన్ని చోట్ల కూడా భారీ ఓపెనింగ్స్ దక్కాలి. అలా కాదని కరోనా వల్ల లాక్ డౌన్.. ఆంక్షలు పెడితే భారీ ఓపెనింగ్స్ ఎలా సాధ్యం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ విషయంలో కూడా యూవీ క్రియేషన్స్ వారు నిద్ర పోతున్నారా అంటూ ప్రభాస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. విడుదల విషయం లో ఎలాగూ లేట్ చేశారు. కనీసం ఈ సినిమా విడుదల వాయిదా విషయాన్ని ప్రకటించి అభిమానుల గందరగోళంకు క్లారిటీ ఇవ్వాలని కొందరు కోరుకుంటున్నారు. ఒక వేళ సినిమా విడుదల వాయిదా పడకుంటే సినిమా విడుదల అవ్వబోతుందని క్లారిటీ ఇవ్వాల్సిందిగా అభిమానులు ఆశ పడుతున్నారు. ప్రభాస్ మరియు పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి చాలా నెలుల గడుస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా ను యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు. హిందీ లో కూడా ఈ సినిమా ను తెరకెక్కించారు. అక్కడ పలు సన్నివేశాలను రీ షూట్ చేశారని అంటున్నారు. కృష్ణం రాజు పాత్రను అక్కడ ఎవరు చూస్తున్నారు అనేది సస్పెన్స్ గా ఉంచారు.