యువీ క్రియేషన్స్ నిర్మాతలు ప్రభాస్ కు మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరి స్నేహం కారణంగానే వారు ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు. మొదటి చిత్రమే ప్రభాస్ తో చేసి భారీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చిన్న, పెద్ద చిత్రాలు చేస్తూ అతి తక్కువ టైంలోనే టాప్ బ్యానర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్ ను బాహుబలి తరువాత మరింత లెవెల్ లో నిల్చోపెట్టాలని తపన పడిన యువీ సంస్థ.. ప్రభాస్ తో సాహో అనే భారీ మూవీ చేసారు. సినిమా టాక్ ఎలాగున్నా ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా చేసారు. అయితే ఈ సినిమా తర్వాత యువీ సంస్థ కాస్త ఒడిదుడుకుల్లో పడింది. దీంతో ప్రభాస్ వారిని ఆదుకునే పని చేసినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. అందులో ఆదిపురుష్ ఒకటి. ఈ చిత్ర కర్ణాటక, నైజాం, ఆంధ్ర, సీడెడ్ హక్కులను యువీకి అందించారట. అందుకు గాను 75 కోట్లు రేటు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ప్రభాస్ సినిమా నైజాం, ఆంధ్ర, సీడెడ్, కర్ణాటకు 75 కోట్లకు రావడం అంటే జాక్ పాట్ కొట్టినట్లే అని.. అలా అలా మార్కెట్ చేసినా 50 కోట్ల మేరకు మిగులుతాయని ఇండస్ట్రీ వర్గాలు చెపుతున్నారు. మొత్తం మీద ప్రభాస్ సాయం వారు ఎప్పటికి మరచిపోలేరు.