బాహుబలి స్టార్ హీరో ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి అందరికి తెలిసిందే. నిజానికి ఈ చిత్రం ఎప్పుడో మొదలు అవ్వాలిసింది. కానీ కరోనా కారణం చేత పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ప్రభాస్ తో నాగ్ అశ్విన్ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం కోసం ప్రభాస్ రెండు సంవత్సరాలు డేట్స్ కేటాయించడం జరిగిందని తెలుస్తుంది.
ఆదిపురుష్ కోసం ఇచ్చిన డేట్స్ ను ప్రభాస్ నాగ్ అశ్విన్ తో సినిమాకోసం ఉపయోగించుకుంటున్నాడు. ఎందుకు అంటే ఆ మధ్య అదిపురుష్ సెట్స్ అగ్నికి ఆహుతి అయిన సంగతి తెలిసిందే. ఈ సెట్ ఇప్పుడిప్పుడే తిరిగి నిర్మించబడుతుంది. అందుకే తిరిగి షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టేలాగా ఉంది. ఆ సమయాని ఆదిపురుష్ కోసం వినియోగిస్తున్నాడు. నాగ్ అశ్విన్ కూడా స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేశాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళుతుంది.
ఈ చిత్రం కోసం జెమ్నాస్టిక్ వచ్చిన కొంతమంది ని తీసుకున్నాడు. ఈ న్యూస్ ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రాని పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలోనే కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ అనే చిత్రాని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయక గా నటిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకొని, ఇటీవలే ఈ చిత్రం కోసం 100 మంది జూనియర్ ఆర్టిస్ట్ లను సెలెక్ట్ చేసింది. త్వరలోనే రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలవ్వనున్నది.