పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. అయితే ఆయన నటిస్తున్న సినిమాల్లో.. ఏది ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుందో మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. ఒకే సారి అర డజన్ సినిమాలకు కమిట్ అయిన డార్లింగ్ ప్రభాస్ చిత్రాల్లో ఏది ముందు రాబోతుందో తెలియడం లేదు.
అయితే ఆయన ఆలస్యంగా కమిట్ అయిన సినిమాలు అనుకున్న దాని కంటే ముందుకు వచ్చేస్తున్నాయి. అందులో భాగంగానే ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్ కన్ఫార్మ్ అయింది. మార్చి 11వ తేదీన రాధే శ్యామ్ రిలీజ్ అవుతుండగా… వచ్చే ఏడాది సంక్రాంతి ఆది పురుష్ సినిమా రాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. రామాయణం ఆధారంగా తెరకెక్కబోతున్న ఆ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా కనిపింబోతున్నారు.
అయితే ఈ భారీ మైథలాజికల్ వండర్ సినిమాను 3డి లో విడుదల చేయబోతున్నారు. టి సిరీస్ రెట్రో ఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆది పురుష్. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా… భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రైత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నయ్యర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.