బాలీవుడ్ నుండి వచ్చిన చాలా మంది డెబ్యూ హీరోయిన్స్ కి టాలీవుడ్ చక్కటి అవకాశాలు కల్పించింది. ఇప్పుడు ఎంతో మంది తారలు అక్కడ ఓ వెలుగు వెలుగుతున్నారు. ఇదే కోవలోకి పూజ హెగ్డే కూడా చేరింది. ఆమె మొదటి చిత్రం ముకుందా వరుణ్ తేజ్ తో ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ కి కూడా అదే మొదటి చిత్రం. ఇద్దరు ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నారు. పూజ హెగ్డే వరస సినిమాలో తెలుగులో చాలా బిజీగా ఉంది. అలాగే బాలీవుడ్ లో వచ్చిన అవకాశాలను కూడా ఆమె వాదులుకోవడంలేదు.
ఆమె కు పేరుతెచ్చిన తెలుగు సినిమాలు చేస్తూనే ఆమె లక్ష్యం అయిన హింది సినిమాపై దృష్టి పెడుతుంది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ తో రాధే శ్యామ్ ఆమె చిత్రంలో నటిస్తుంది. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రంలో ను హీరోయిన్ గా నటిస్తుంది.
హిందీలో ఆమె సర్కస్ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ నుండి స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలో అవకాశం కొట్టేసింది. పూజ హెగ్డే కు ఇదే అక్కడ మొదటి చిత్రం. ఇప్పటికే మాస్టర్ చిత్రంతో హిట్ కొట్టిన విజయ్ తన తదుపరి చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చెయ్యనున్నడు. అందుకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి సిద్దంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ చిత్రంకోసం పూజ హెగ్డే ను హీరోయిన్ గా తీసుకొనున్నారు.
అందుకు ఆమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారంట. అందుకు ఆమె కూడా ఒకే అన్నట్లుగా సమాచారం. పూజ కూడా విజయ్ తో సినిమాకోసం తన సినిమా డేట్స్ ను అడ్జెస్ట్ మెంట్ చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ తో సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.