అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా, పంజాబీ ముద్ధు గుమ్మ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం “ఆర్ఎక్స్ 100”. ఈ చిత్రంలో పాయల్ నటనకు మంచి పేరు వచ్చింది. యూత్ తన అందంతో, ఎక్స్ ఫోజింగ్ తో కట్టిపడేసింది. ఈ చిత్రం తర్వాత టాలీవుడ్ లో బిజీ అయిపోవచ్చు అని భావించింది కానీ పెద్దగా మాత్రం ఆఫర్స్ ఏమి రాలేదు.
వెంకటేష్, రవి తేజ ల సినిమాల్లో తప్ప ఆమెకు కుర్ర హీరోలతో నటించే ఛాన్స్ మాత్రం రాలేదు. ఈ మధ్య వచ్చిన “అనగనగా ఓ అతిది” చిత్రంలో పాయల్ నటించింది. ఈ చిత్రం ఆమెకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె శర్వానంద్ హీరోగా వస్తున్న “మహాసముద్రం” అనే చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్ లో అడిపాడుతుంది. గతంలో ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “సీత” చిత్రంలో ఐటెమ్ సాంగ్ లో నర్తించింది.
సినిమాల్లో అవకాశాలు లేకపోయినప్పటికి ఇంస్టా లో తన అభిమానులకు నిత్యం తన ఫోటో షూట్స్ తో టచ్ లోనే ఉంటుంది. పాయల్ కు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. ఈ మధ్య తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు వైరల్ అవ్వుతున్నాయి. తాజాగా ఆమె తన ఇంస్టాలో ముద్దులు పెడుతూ యూత్ ను పిచ్చెకిస్తుంది. ఒక్కటి కాదు రెండు కాదు అలా ఆగకుండా ఆమె ముద్దులు ఇస్తున్న వీడియో బాగా వైరల్ అవ్వుతుంది.
నెటిజన్స్ సైతం ఆమె ముద్దులపై కామెంట్స్ చేస్తున్నారు. ఆ ముద్దులు మొత్తం మీ బోయ్ ఫ్రెండ్ కేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. తమిళంలో పాయల్ ఏంజల్ అనే చిత్రంతో ఎంట్రీ ఇస్తుంది. ఉదయనిది స్టాలిన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాని అధియమన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తన సొంత బాష అయిన పంజాబ్ లోనూ పలు సినిమాల్లో నటించింది పాయల్ రాజ్ పుత్.