RX 100 చిత్రంతో యూత్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న పాయల్ రాజపుత్..తాజాగా ఆంధ్రప్రదేశ్ జగన్ మోహన్ రెడ్డి ఫై ప్రసంశలు జల్లు కురిపించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కశాళాల క్రీడా మైదానంలో ప్రీమియర్ లీగ్ సీజన్–4 క్రికెట్ పోటీలను ఆదివారం మంత్రి అనిల్ కుమార్, ఎంపీ మార్గాని భరత్తో కలిసి పాయల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘అందరూ బాగున్నారా.. అందరికీ నమస్కారం.. స్టార్స్ అందరూ డిసెంబర్ నెలలోనే పుడతారు. మన డైనమిక్ సీఎం జగన్మోహన్రెడ్డితో పాటు నేను కూడా డిసెంబర్ నెలలోనే పుట్టాను. కాలేజీ రోజుల్లో క్రికెట్ ఆడేదానిని, తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం’ అని తెలిపింది. అలాగే రాజమహేంద్రవరం రావడం తనకు సంతోషంగా ఉందని, ఇక్కడి గోదావరి అందాలు చాలా బాగుంటాయని చెప్పుకొచ్చింది.