సూపర్ స్టార్ రజనీకాంత్ అపోలో హాస్పటల్ లో చేరడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. పది రోజుల క్రితం రజనీకాంత్ తన కొత్త చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చారు. కాగా చిత్ర యూనిట్ లో 8 మందికి కరోనా సోకడం తో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. రజిని సైతం కరోనా టెస్ట్ చేసుకోగా ఆయనకు నెగిటివ్ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం హైబీపీతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో రజనీకాంత్ చేరారు. రెండు రోజుల పాటు చికిత్స అవసరమని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనతో పాటు కుమార్తె ఐశ్వర్య ఆస్పత్రిలోనే ఉన్నారు. రజినీకి హైబీపీ మినహా ఇతర ఆరోగ్య సమస్యలేవి లేవని హాస్పిటల్ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా రజినీ ఆరోగ్యంపై స్పందిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు జనసేన అధినేత, పవన్ కళ్యాణ్. ప్రముఖ కథానాయకులు శ్రీ రజినీకాంత్ గారు అస్వస్థతతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చేరినట్లు తెలిసి బాధపడ్డాను. కరోనా లక్షణాలు లేవని వైద్యులు ప్రకటించడం ఊరటనిచ్చింది. మనోధైర్యం మెండుగా ఉన్న శ్రీ రజినీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆధ్యాత్మికపరులైన ఆయనకు భగవదనుగ్రహం కలగాలి. ఆయన ఎంతగానో విశ్వసించే మాహావతార్ బాలాజీ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు రావాలని కోరుకుంటున్నాను” అని పేర్కొంటూ జనసేన తరఫున నోట్ రాశారు పవన్ కళ్యాణ్.