సాయి ధరమ్ తేజ్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ప్రేమో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చాల సార్లు పబ్లిక్ ఫంక్షన్ లలో పవన్ గురించి తెలిపి అభిమానులను ఖుషి చేసాడు. తాజాగా తేజ్ – పవన్ కళ్యాణ్ ల సంబందించిన ఓ పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. డిసెంబర్ 9న నిహారిక-చైతన్య పెళ్లి జరగగా, ఆ వేడుకకి హాజరైన తేజూ ఓ సందర్భంలో పవన్ చేతిని పట్టుకొని నవ్వుతూ కనిపించాడు. వీరిద్దరు కలిసి ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడం తో..దీని గురించి అంత మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు.
సోలో బ్రతుకే సో బెటర్ ప్రమోషన్‌కు సంబంధించిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ ఫోటో తాలూకా ప్రశ్న సాయిధరమ్‌కు ఎదురైంది. దానిపై స్పందించిన తేజ్.. నేను మామ ఓ ఫొటో అని అడిగాను. దానికి ఆయన ఏరా ముందు నాతో ఎప్పుడు ఫొటో దిగలేదా అని అన్నారు. ఆ సమయంలో మా ఇద్దరి మధ్క జరిగిన సంభాషణ అది అని క్లారిటీ ఇచ్చాడు తేజ్. ప్రస్తుతం తేజ్ సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రాన్ని చేసాడు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.