పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి హరిహర వీరమల్లు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పీరియాడికల్ నేపథ్యంలో ఈ రూపొందుతున్న సంగతి అందరికి తెలిసిందే. హైదరాబాద్ నగర శివారుల్లో ఈ చిత్రం కోసం క్రిష్ భారీ సెట్స్ ను నిర్మించాడు. ఆనాటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ సెట్ ను నిర్మించాడు.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జక్వాలెన్ ఫెర్నాండెజ్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క షూటింగ్ ను మొదలు పెట్టిన క్రిష్ ఈ చిత్రంలోని ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను రూపొందించాడు. ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో టెక్నాలజి ఎక్కువ అవ్వడంతో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉండటం వలన ఏ రంగానికి సంబందించినది అయిన ఇట్టే తెలిసి పోతుంది. అలాగే ఈ చిత్రంలోని పవన్ కళ్యాణ్ లుక్ ఒక్కటి లీక్ అయ్యింది. ఎప్పుడు గుబురు గడ్డంతో కనిపించే పవన్ కళ్యాణ్ కోరమీసంతో ఆనాటి కాలంలో ప్రజలు ధరించే దుస్తులను ధరించిన లుక్ ఆకట్టుకుంటుంది.
ఈ లుక్ పై పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షేర్స్ లైకులతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తున్నారు. దాదాపుగా ఈ చిత్రంకోసం 170 కోట్లను ఖర్చు పెడుతున్నారు. పవన్ సినిమాకోసం ఈ రేంజ్ లో ఖర్చు పెట్టడం ఇదే మొదటిసారి. ఈ చిత్రం పాన్ ఇండియా లేవల్లో రూపొందుతుంది. ఈ చిత్రం యొక్క పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ను మరియు టైటిల్ ను మహాశివరాత్రి కు విడుదల చెయ్యనున్నారు.