టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కరోనా భారీన పడటంతో చికిత్స కోసం ఆయన ఫామ్ హౌస్ లోకి వెళ్లిపోయాడు అక్కడే ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. అపోలో వైద్య బృందం పవన్ కు చికిత్స అందిస్తుంది. కళ్యాణ్ గారు మొదటి రోజు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు ఆయనకు నేరుగా ముక్కు ద్వారా ఆక్సిజన్ పైపును వేసి చికిత్స అందించడం జరిగింది.
ఆ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వుతుంది.తాజా సమాచారం మేరకు శ్వాసకు సంబందించిన ఇబ్బంది అంతగా లేదు అని తెలుస్తుంది. జ్వరం మొదట రెండు మూడు రోజులు వస్తు పోతు ఉంది. ఇప్పుడు జ్వరం సమస్య మాత్రం అంతగా ఏమి లేదు. కాకపోతే బాడి పెయిన్స్ , గొంతు నొప్పి సమస్య ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం నిలకడగానే ఉంది.
కరోనా తీవ్రత పై పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా ప్రెస్ నోట్ ను విడుదల చేశాడు. అందులో బయట కరోనా తీవ్రత అధికంగా ఉంది. ప్రతి ఒక్కరు విదిగా మాస్క్ ధరించాలి. అలాగే చేతులను సానిటైజ్ చేసుకుంటూ సోషల్ డిస్టన్స్ పాటించాలని కోరడం జరిగింది. కరోనా నుండి కోలుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమా షూటింగ్ లలో పాల్గొననున్నాడు.