ప్రదీప్ మాచిరాజ్ మొదట యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించాడు. ఎన్నో టివి షోస్ చేశాడు. ప్రస్తుతం హీరోగా మారాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో కెరీర్ లో మొదటిసారి హీరోగా మారి మంచి హిట్టును కొట్టాడు. మొదట ఈ చిత్రానికి నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయిన నాలుగు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేసింది. ఈ చిత్రం యొక్క విజయంతో హ్యాపీగా ఉన్న ప్రదీప్ తనకు లైఫ్ ను ఇచ్చిన యాంకరింగ్ ను మాత్రం వదలడం లేదు.
ప్రస్తుతం ఢీ జోడి, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, వంటి షోస్ కి యాంకర్ గా రానిస్తున్నాడు. ప్రదీప్ యాంకర్ గా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అయిదోవ సీజన్ నడుస్తుంది. ఈ సీజన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను గెస్ట్ గా తీసుకురాబోతున్న అన్నట్లుగా ప్రదీప్ ఒకానొక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో రావాలిసింది కానీ ఆయనకు ఉన్న బిజీ షెడ్యూల్ వలన కుదరలేదు. ఈ సీజన్ లో కచ్చితంగా వస్తాడు అంటూ చెప్పాడు.
ఇలాంటి షోస్ కి ఆడియో వేడుకలకు దూరంగా ఉండే పవన్ ప్రదీప్ షో కి వస్తున్నాడు అనే వార్తలు రావడంతో బుల్లి తెరపై కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసే అవకాశం ఉంది. గతంలో ప్రదీప్… పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేష్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో నటించాడు. అప్పటి నుండి పవన్ తో ప్రదీప్ కు మంచి సానిహిత్యం ఉంది. మెగా స్టార్ చిరంజీవి కి ప్రదీప్ వీరాభిమాని కూడాను. ప్రదీప్ తదుపరి సినిమా విషయంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విజయాని ఎంజాయ్ చేస్తున్నాడు.