మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లికి పవన్ కళ్యాణ్ వస్తాడో రాడో అని నిన్నటి వరకు మెగా అభిమానులంతా ఖంగారు పడ్డారు కానీ పవన్ పెళ్లి కి హాజరై , పెళ్లి పవర్ తెచ్చాడు. మరికొన్ని గంటల్లో నిహారిక జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కోడలు కాబోతుంది. ఈరోజు రాత్రి (డిసెంబర్ 9) నిహారిక- చైతన్య మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి కానున్న నేపథ్యంలో సంబరాలు మిన్నంటాయి. మెగా ఫ్యామిలీ అంతా రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ ప్యాలస్‌లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.
నిహారిక మెహందీ వేడుకల్లో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన తనయుడు అకీరా సైతం వచ్చారు. బంగారు కోడిపెట్ట పాటకు చిరు-సురేఖ, బన్నీ స్టెప్పులేయగా, రామ చిలకమ్మ పాటకు అల్లు అరవింద్ – నిర్మల దంపతులు డ్యాన్స్‌లు చేసి అందరిలో హుషారును నింపారు. గ్యాంగ్ లీడర్ పాటకు నాగబాబు, నిహారిక – చైతన్య డ్యాన్స్ చేసి అదరగొట్టారు. ఇక పవన్ కళ్యాణ్ రాక తో నాగబాబు ఇంకాస్త సంతోషంగా ఉన్నాడు.