
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హీరో దగ్గుబాటి రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాకు కోసం ప్రేక్షకులు ఎంతగా వేచి చూస్తున్నారో కూడా అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విడుదల చేసిన రెండు గంటల్లోనే 16 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.

అయితే ఈ సినిమా ట్రైలర్ లో… ఏంటి బాలాజీ స్పీడు పెంచావు.. పులి పెగ్గేసుకొని పడుకొంది కానీ నువ్వు స్లోగానే పోనీ అంటూ రానా దగ్గుబాటి వాయిస్ తో భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదల అయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రెజెన్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా ట్రైలర్ అదిరిపోయింది. అయితే ఫిబ్రవరి 25న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

మలయాళంలో హిట్ కొట్టిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’కు రీమేక్ గా భీమ్లా నాయక్ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలోపవన్ కల్యాణ్ పోలీస్ అధికారిగా నటించారు. డేనియల్ శేఖర్ గా రానా కీలక పాత్రలో కనిపంచారు. హీరోయిన్ నిత్యా మేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ సంగీతమందిచగా… సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో ఫిబ్రవరి 25వ తేదీనే రిలీజ్ చేయబోతున్నారు.