పవన్ కళ్యాణ్ మూడున్నర ఏండ్ల తర్వాత నటించిన మొదటి చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం అటు అభిమానులతో పాటుగా అన్నీ రకాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం పవన్ కరోనా భారీన పడటంతో సినిమా షూటింగులకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇక కరోనా నుండి కోలుకున్న వెంటనే పవన్ షూటింగులకు అట్టేన్ద్ అవ్వనున్నాడు.
క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే చిత్రంలో నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రంగా రూపొందుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది. అలాగే సాగర్ చంద్ర దర్శకత్వంలో మలయాళం మూవీ తెలుగు రీమేక్ అయ్యపనుమ్ కొషియమ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను సిద్దం చేసుకొని పవన్ కోసం ఎదురు చూస్తున్నాడు.
తాజా సమాచారం మేరకు హరీష్ శంకర్ చిత్రంలో పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. తండ్రి కొడుకుల పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నారు అంట. పోలిటికల్ ఇమేజ్ ఉన్న తండ్రి ఒక్కటి కాగా మరొక్కటి వచ్చేసి తండ్రి గౌరవాన్ని కాపాడే కొడుకు పాత్ర ఒక్కటి చాలా ఎనర్జటిక్ గా కొడుకు పాత్ర ఉంటుందని సమాచారం. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ పోలిటికల్ కెరీర్ ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగ డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది.