కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 4 రియాల్టీ షో చివరి దశకు చేరుకుంది. ఉన్న వారిలో ఎవరు ఫైనల్ కు చేరుతారో..ఎవరు బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అవుతారో అనే ఆసక్తి నెలకొని ఉంది. మరోపక్క సినీ ప్రముఖులు బిగ్ బాస్ షో పట్ల వారి అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ షో ఫై ఇంకాస్త క్రేజ్ , టైటిల్ విన్నర్ ఫై ఆత్రుత పెంచుతున్నారు. ఇప్పటికే పలువురు తమ స్పందనను తెలుపగా..తాజాగా ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ బిగ్ బాస్ పై తన స్పందనను తెలిపారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది. టాప్ 5 లో ఎవరు ఉండవచ్చు అన్నదానిపైనే పరుచూరి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
చిన్న రామయ్య ఎన్టీఆర్ సీజన్ 1, నాని సీజన్ 2, నాగార్జున సీజన్ 3.. వీటన్నింటినీ చూశాం. ముగ్గురూ చాలా బాగా చేశారు. అయితే ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన వాళ్లని చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రెటీలు, బాగా పాపులర్ అయిన వాళ్లని తీసుకువస్తుంటారు. కానీ ఈ సీజన్‌లో ఎక్కువ యూత్‌ని తీసుకువచ్చారు. షో చూస్తుంటే మనం ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నామో వాళ్ళు వెళ్లడంలేదు. ఎవరు వెళ్లారు అని అనుకుంటామో వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. టీవీ 9 దేవి ఉంటుందని అనుకున్నాం ఆమె కూడా వచ్చేసింది. అదేవిధంగా అమ్మా రాజశేఖర్ చివరి వరకూ ఉంటాడని అనుకున్నాం.. అతను కూడా ఎలిమినేట్ అయ్యాడు. దివి కూడా ఉంటుందనే అనుకున్నాం ఆమె కూడా బయటకు వచ్చేసింది.కుమార్ సాయి అయినా ఉంటాడనుకున్నాం కానీ అతడు కూడా బయటకు వచ్చేసాడు. ఇలా మంచి మంచి కంటెస్టెంట్స్ అంతా ఎలిమినేట్ అయ్యారు. అఖిల్ వెళ్లిపోతున్నాడనే అనుకున్నారంతా అంతలా రక్తికట్టించగలిగాడు నాగార్జున. కాని అతడికి ఎకంగా 8 కోట్ల ఓట్లు పడ్డాయి. హౌస్ మేట్స్ కూడా అద్భుతంగా చేశారు ఆ ఎపిసోడ్‌లో.అరియానాకి తక్కువ ఓట్లు పడతాయని అనుకున్నా.. కానీ ఆమే ఫస్ట్ సేవ్ అవుతోంది. దీన్ని బట్టి ఇంటి సభ్యులు ఎవర్నైతే కార్నర్ చేస్తున్నారో వాళ్లకి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. ఇక ఇప్పుడు ప్రేక్షకులు ఎక్కువగా అభిజిత్, అరియానాలకు ఓట్లు వేసే అవకాశం ఉంది. ఈ ఇద్దరు టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. ఆదివారం ఎపిసోడ్‌లో ఏడ్చేసిన వాళ్లు.. సోమవారం నామినేషన్స్‌కి వచ్చేసరికి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ప్రేక్షకులకు తెలియని చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకువచ్చి మట్టిలో మంక్యాలను చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం.” అంటూ బిగ్ బాస్ పై పరుచూరి ప్రశంసల వర్షం కురిపించారు.