తమిళ్ ఇండస్ట్రీ లో విషాదం చోటు చేసుకుంది. ‘పాండియన్ స్టోర్’లో ముల్లై పాత్రతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి వి.జె.చిత్ర(28) ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని నజరేత్‌పేట్‌లో గల ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసిన చిత్ర సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కొద్ది నెలల క్రితమే ఆమెకు వ్యాపారవేత్త హేమంత్‌తో నిశ్చితార్థం జరిగింది.
ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు రోజు రాత్రి ఆమె ఈవీపీ ఫిల్మ్‌సిటీలోని ఓ టీవీ సీరియల్ షూటింగ్‌లో పాల్గొన్నారు. తెల్లవారు జామున 2:30 గంటలకు ఆమె హోటల్ గదికి చేరుకున్నారు. హఠాత్తుగా ఆమె ఆత్మహత్య చేసుకోవడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. సమచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ ఘటనపై చిత్ర కుటుంబసభ్యులు ఇంకా స్పందించలేదు. బుల్లితెరపై విశేషంగా రాణిస్తూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న చిత్ర ఆత్మహత్య చేసుకుందని తెలిసి ఆమె స్నేహితులు, సహనటులు షాకవుతున్నారు.