
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదలకు రెడీగా ఉంది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో పాట పాడి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కిన్నెర మొగులయ్య… సినిమా రిలీజ్ కాక ముందే పద్మ శ్రీ అందుకున్నారు.

కిన్నెర మొగులయ్య నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామంలో నివాసం ఉంటారు. అయితే ఆయన పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారలో అఖరి తరం కళాకారుడు. అత్యంత వినసొంపైన, వైభవమైన కిన్నెర మెట్ల కళను గుర్తించి తనకు భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చిన పవన్ కల్యాణ్ కు తానెప్పుడూ రుణపడి ఉంటానని చెబుతున్నారు.

అందులో పాడిన పాట వల్లే తనను ప్రభుత్వం గుర్తించిందని చెప్పాడు. పవన్ కల్యాణ్ వల్లే తనకు పద్మ శ్రీ అవార్డు వచ్చిందని.. ఆనందం వ్యక్తం చేశాడు. అయితే తను ఇప్పుడు… ‘పవన్ సార్ ని కలవాలని పోతే ఆ కర్రె బట్టులోళ్లు ఆపి, ఆయన లేడని చెప్పినారు. త్వరలోనే ఆయనను కలుస్తా’ అంటూ ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వీడియోను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చూసి.. కిన్నెర మెగలయ్యను కలుస్తారో లేదో చూడాలి.