ప్రభాస్, పూజా హెగ్దే జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధేశ్యామ్ . యువి క్రియేషన్స్ బ్యానర్ లో 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సౌత్ వర్షన్ కు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించారు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని థమన్ అందిస్తున్నారు.
ఓ పక్క జనవరి 14న సినిమా రిలీజ్ అంటూ చెబుతున్నా సరే సినిమా రిలీజ్ విషయంలో కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. ఇప్పటికే జనవరి 7న రిలీజ్ అవ్వాల్సిన ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ వాయిదా పడగా లేటెస్ట్ గా Prabhas రాధేశ్యామ్ కూడా అదే బాటలో వెళ్తుందని అంటున్నారు. ఈ క్రమంలో రాధేశ్యామ్ సినిమాకు ఓ అదిరిపోయే ఓటీటీ డీల్ వచ్చిందని టాక్. ప్రముఖ ఓటీటీ సంస్థ Prabhas రాధేశ్యామ్ సినిమాకు 350 కోట్ల దీల్ తో ముందుకొచ్చారట.
రాధేశ్యామ్ మేకర్స్ ను ఇది టెంప్ట్ చేస్తున్నా సరే థియేట్రికల్ రిలీజ్ బిజినెస్ 450 కోట్ల దాకా జరగడంతో ఓటీటీ ఆలోచనని హోల్డ్ లో పెట్టారట. అయితే రిలీజ్ విషయంలో మరోసారి వాయిదా పడితే ఈసారి ఓటీటీ కి ఓకే చెప్పే అవకాశం ఉంది. అయితే వారు చెప్పిన రేటుకి మరింత పెంచి డీల్ క్లోజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్.