మలయాళంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ఆస్కార్’ సినిమాను తెలుగులో డబ్ చేసి ‘ఆహా’ ద్వారా విడుదల చేశారు. ఇటీవల ఆహాలో విడుదల అయిన మలయాళ డబ్బింగ్ వర్షన్ లు మంచి సక్సెస్ అయ్యాయి. అందుకే ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి కనిపించింది. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆస్కార్ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ : చిన్నప్పటి నుండి కూడా సినిమానే జీవితంగా బతికేస్తున్న ఇస్సాక్ ఇబ్రహం (టోవినో థామస్) దర్శకుడు అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. నిర్మాతలు ఎవరు ముందుకు రాకపోవడంతో సొంతంగానే సినిమాను నిర్మించాలని భావిస్తాడు. అందుకోసం తన భూములను ఆస్తులను అమ్మేసి దాదాపు 50 లక్షల రూపాయల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తాడు.
ఆ సినిమా నిర్మాణ సమయంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. అతడు ఆ సినిమాను విడుదల ఎలా చేశాడు, ఆ తర్వాత ఆస్కార్ వరకు ఈ సినిమా ఎలా వెళ్లింది అక్కడ ఏం జరిగింది అనేది కథగా రూపొందించారు.
విశ్లేషణ : టోవినో థామస్ విభిన్నమైన నటనతో మెప్పించాడు. దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలనే తాపత్రయంతో ఎన్నో కష్టాలు పడే యంగ్ డైరెక్టర్ పాత్రలో ఈయన నటించి మెప్పించాడు. ఇతర నటీనటులు కూడా వారి పాత్రల పరిధిలో నటించి ఆకట్టకున్నారు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సీన్స్ ను చాలా సహజంగా చిత్రీకరించారు.
దర్శకుడు కూడా మంచి స్ర్కీన్ ప్లేతో మెప్పించాడు. మలయాళ సినిమాలు నాచురాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. ఇలాంటి సినిమాలు తెలుగు ఆడియన్స్ కు ఎక్కడం కష్టమే కాని ఓటీటీ ప్రేక్షకులకు కనుక సినిమా పర్వాలేదు అనిపించొచ్చు. కొన్ని సీన్స్ మనసుకు భారంగా అనిపించడంతో పాటు క్లైమాక్స్ విషయంలో ప్రేక్షకులు నిరాశ చెందారు.
మొత్తంగా ఆహా అనిపించేంతగా లేదు కాని టైం పాస్ కానట్లయితే ఒకసారి చూడదగ్గ సినిమా.