శ్రీ ముఖి బుల్లి తెరపై ఓ సెన్సేషన్. సినిమాల్లో హీరోయిన్ అవ్వుదామని వచ్చి యాంకర్ గా సెట్టిల్ అయింది. సుమా తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తి శ్రీ ముఖి. పాటస్ షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ రవి తో కలిసి ఆ షో కు యాంకరింగ్ చేస్తుంది. అలాగే మరి కొన్ని టివి షో లకు యాంకర్ గా కొనసాగుతుంది. అలాగే సినిమాల్లో తనకు తగిన పాత్రలు వస్తే నటిస్తుంది.
బిగ్ బాస్ షో ద్వారా మరింత అభిమానాన్ని సంపాదించుకుంది. ఈ షో తర్వాత శ్రీ ముఖి కి మరింత పేరు వచ్చింది. సోషల్ మీడియాలో కూడా శ్రీ ముఖి కి బాగానే ఫాలోయింగ్ ఉంది. నిరంతరం తన ఫోటోలను వీడియో లను షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆ మధ్య గోవాలో ఫ్రెండ్స్ తో కలిసి టూర్ కు వెళ్ళిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఈ మధ్య శ్రీ ముఖి పెళ్లి వార్తలు నిరంతరం అంతర్జాలంలో వైరల్ అవ్వుతున్నాయి. శ్రీ ముఖి ప్రేమలో ఉన్నదని త్వరలో పెళ్లి చేసుకోబోతుందని నిరంతరం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
తాజాగా అవే వార్తలు మరోసారి వైరల్ అవ్వుతున్నాయి ముంబై కు చెందిన ఓ వ్యక్తి తో శ్రీ ముఖి డేటింగ్ చేస్తుందని త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. శ్రీ ముఖి అతను మంచి స్నేహితులు అని తెలుస్తుంది. మరి ఈ పెళ్లి వార్తలపై శ్రీ ముఖి క్లారీటీ ఇస్తుందో లేదో తెలియాలి అంటే మరికొద్ది రోజులు అగాలిసిందే.