మాస్ మహారాజ్ రవి తేజ ఈ ఏడాది క్రాక్ చిత్రంతో విజయాని దక్కించుకున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ డైరెక్షన్ లో ఖిలాడి అనే చిత్రంలో నటిస్తున్నాడు. రవి తేజ ఈ స్థాయి కి రావడానికి ముఖ్య కారకుడు ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు పూరీ జగన్నాథ్. ఇడియట్ సినిమాకు ముందు రవి తేజ సినిమాలో నటించాడు కానీ సోలోగా, మాస్ హీరో పాత్ర ఉన్న ఒక్క సినిమా కూడా పడలేదు.
పూరీ తో రవితేజ లైఫే ఛేంజ్ అయిపోయింది. విరిద్దరి కలయికలో ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఈ మూడు బ్లాక్ బస్టర్స్ తో రవి తేజ కు సఫరేట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. మాస్ మహారాజ్ గా ఎదిగాడు. ఆ తర్వాత మరికొంత కాలానికి విరిద్దరి కాంబినేషన్ లో దేవుడు చేసిన మనుషులు సినిమా వచ్చింది. కానీ ఈ చిత్రం నిరాశ పరచడంతో మరల వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు.
కానీ తాజా వార్తల నేపథ్యంలో పూరీజగన్నాథ్, రవితేజ కోసం ఓ కథను సిద్దం చేశాడు అంట. ఈ మధ్య రవి తేజను కలిసి తాను సిద్దం చేసిన కథను వినిపించినట్లుగా సమాచారం రవితేజ సైడ్ నుండి అంత ఓకే అన్నట్లుగా తెలుస్తుంది. వీరి కాంబినేషన్ లో సినిమాను పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పై నిర్మించాలని ఛార్మి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పూరీ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పూరీ జగన్నాథ్ తన మార్క్ ను చూపించాడు. వచ్చే సమ్మర్ లో ఈ చిత్రం విడుదల అవ్వనున్నది.