టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ మరియు రాంచరణ్ అభిమానులు ఎప్పుడూ కూడా సోషల్ మీడియా వేదికగా అంటూ గొడవ పడుతూ ఉంటారు. ఒకరిపై ఒకరు ఎప్పుడూ ఆరోపణలు చేసుకుంటూ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అభిమానులు అలా కొట్టుకు చస్తుంటే హీరోలు మాత్రం అన్న తమ్ముడు అంటూ కలిసిపోయి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రస్తుతం వీరిద్దరు కలిసి రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సందర్భంగా వీరిద్దరి మధ్య గాఢమైన అనుబంధం ఏర్పడినట్లు గా తాజాగా చేసిన వ్యాఖ్యలతో వెల్లడవుతుంది. ఎన్టీఆర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు రామ్ చరణ్ దేవుడిచ్చిన తమ్ముడు అంటూ వ్యాఖ్యలు చేశాడు. నాకు రామ్ చరణ్ తో ఉన్న అనుబంధం చాలా బలమైనది. అతడితో నాకు చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మేమిద్దరం కలిసి చేస్తున్న సినిమా కూడా చాలా బాగా వస్తుందని నమ్మకం గా ఉంది అన్నాడు.
ఎన్టీఆర్ మాటలు వింటే వీరిద్దరి మధ్య ఎంత మంచి అనుబంధం ఉందా అంటూ అనుమానాలు కలగక మానవు. అయితే వీరిద్దరూ చాలా మంచి స్నేహితులం గతంలోనే తెలిసిన విషయం తెలిసిన విషయమే ఇప్పుడు అదే విషయాన్ని మరోసారి ఎన్టీఆర్ మాట్లాడుతూ చరణ్ నాకు తమ్ముడు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలతో అయినా ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవలు తగ్గుతాయని ఆశిద్దాం.