యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ మొదటి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించి షో సక్సెస్ లో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత సీజన్ లకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తాడని అంత అనుకున్నారు కానీ వరుస సినిమాలు ఉండడం తో ఎన్టీఆర్ మళ్లీ హోస్ట్ గా చేయలేదు. అయితే ఇప్పుడు మరోసారి ఓ షో కు హోస్ట్ గా వహరించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియా లో వరం రోజులుగా వైరల్ అవుతూ వస్తుంది. అయితే ఇకప్పుడు మరో వార్త బయటకు వచ్చి అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.
జెమినీ టీవీ లో ప్రసారం కాబోయే ఈ షో మరో రెండు నెలల్లో ప్రసారం కాబోతుందట. మొత్తం 60 ఎపిసోడ్స్ ప్రసారంగా కానుండగా ఒక్కో ఎపిసోడ్ కు ఎన్టీఆర్ 30 లక్షల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడట.అంటే టోటల్ గా జెమిని టీవీ నుంచి ఎన్టీఆర్ వచ్చేది 18 కోట్లు అన్నమాట. తెలుగు టీవీ చరిత్రలో ఇది అతి పెద్ద రెమ్యూనిరేషన్ అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.మీలో ఎవరు కోటీశ్వరుడు తరహాలో సాగే ఈ కార్యక్రమానికి కొత్త పేరు ఫిక్స్ చేస్తున్నారు అది కూడా త్వరలో వెల్లడి అవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు.