ఎన్‌టిఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ అనే చిత్రం వచ్చి మంచి విజయం సాదించింది. ఈ చిత్రంలో ఎన్‌టిఆర్ స్టూడెంట్ గా ప్రకృతి ప్రేమికుడిగా నటించి మెప్పించాడు. ఇదే కాంబినేషన్ లో త్వరలో మరో చిత్రం ఉండబోతున్న సంగతి అందరికే తెలిసిందే. వాస్తవానికి ఎన్‌టిఆర్, త్రివిక్రమ్ కథతో వస్తాడు అనుకుంటే అనూహ్యంగ కొరటాల శివ లైన్లోకి తీసుకు వచ్చాడు.
కొరటాల ఇప్పటికే ఎన్‌టిఆర్ కోసం పక్క స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. జూన్ లేదా జులై నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నది. అది కూడా అప్పటి వరకు కరోనా తగ్గుముఖం పడితేనే. అయితే ఈ చిత్రంలో ఎన్‌టిఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడు అని ఓ టాక్ వినపడుతుంది. స్టూడెంట్ లీడర్ గా ఎన్‌టిఆర్ గతంలో నాగ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం మంచిగానే ఉన్న ప్రేక్షకుల్లోకి వెళ్లలేదు. ఈసారి కొరటాలతో ఆ మార్క్ ను చెరిపేయ్యాలని చూస్తున్నాడు.
స్టూడెంట్స్ రాజకీయాల్లోకి రావాలని ప్రభుత్వాలని ప్రశ్నించాలని, కాలేజ్ నుండే స్టూడెంట్స్ రాజకీయాలపై అవగాహన ఉండాలని ఇలా ఎన్నో అంశాలను కొరటాల శివ తన తదుపరి సినిమాలో చూపించనున్నాడు. అయితే నేటి యూత్ డిజిటల్ లైఫ్ కు బాగా అలవాటు పడిపోవడంతో సోమరిపోతులు రౌడీ లు మరియు రాజకీయ నాయకుల వారి కొడుకులు రాజకీయాలను బ్రష్ఠు పటిస్తున్నారు.
అందుకే స్టూడెంట్స్ లో చైతన్య తీసుకురావలనే ఉద్దేశ్యంతో కొరటాల శివ, ఎన్‌టిఆర్ తో ఈ కథను చేస్తున్నాడు అని బయట సమాచారం. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ కు సంబందించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.